: థానేలో కుప్పకూలిన భవనం... ముగ్గురి మృతి, శిథిలాల కింద మరో 20 మంది


మహారాష్ట్రలోని థానే నగరంలో నేటి తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో అందులో నివాసముంటున్న వారంతా భవన శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మంది దాకా శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని సజీవంగా బయటకు తీసుకురాగలిగాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News