: కలాం స్ఫూర్తి శతాబ్దాలపాటు కొనసాగుతుంది: శ్రీలంక అధ్యక్షుడు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తి శతాబ్దాలపాటు నిలిచి ఉంటుందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. కొలంబోలో ఆయన మాట్లాడుతూ, కలాం మృతి తీరని లోటని అన్నారు. అబ్దుల్ కలాం యావద్దేశాన్ని నూతన మార్గంలో పయనింపజేశారని ఆయన తెలిపారు. ఆయన స్ఫూర్తి శతాబ్దాలపాటు నిర్విరామంగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కలాం జీవితం ఎందరికో ఆదర్శనీయమని ఆయన తెలిపారు.