: కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తాం: శివరాజ్ సింగ్ చౌహాన్
గొప్ప స్ఫూర్తి ప్రదాత, దార్శనికుడైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కలాం జీవిత చరిత్ర ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కలాం నిరూపించారని ఆయన కొనియాడారు. అబ్దుల్ కలాం మృతి దేశానికి తీరని లోటని ఆయన తెలిపారు. ఆయన లోటును ఎన్నటికీ ఎవరూ భర్తీ చేయలేరని ఆయన పేర్కొన్నారు.