: ట్విట్టర్ లో కలాం పేరు తప్పుగా పోస్టుచేసిన అనుష్కా శర్మ!... వెల్లువెత్తిన విమర్శలు


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూయడంతో దేశమంతా శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతికి సంతాపంగా పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా బాలీవుడ్ నటి అనుష్కా శర్మ కూడా కలాం మృతిపట్ల ట్విట్టర్ లో స్పందించింది. అయితే ఏపీజే అబ్దుల్ కలాం బదులుగా 'ఏపీజే కలాం అజాద్' అని పోస్టు చేయడం కలకలం రేపింది. దాంతో అమ్మడిపై ట్విట్టర్ లో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కో రకంగా మాటల దాడి చేశారు. ఇది గమనించిన అనుష్క సదరు ట్వీట్ ను తొలగించి మళ్లీ పోస్టు చేసింది. రెండవసారి కూడా అదే తప్పు దొర్లింది. చివరికి తన నిర్లక్ష్యాన్ని గుర్తించిన ఈ భామ మూడవసారి తప్పుల్లేకుండా కలాం పేరు పోస్టు చేసి సంతాపం వ్యక్తం చేసింది. ఏదైతేనేం ఎంతో పాప్యులర్ అయిన ఓ బాలీవుడ్ నటి ఇలా మాజీ రాష్ట్రపతి పేరు విషయంలో తప్పు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News