: బతికుండగానే కలాం ఫొటోకు నివాళి అర్పించిన జార్ఖండ్ మహిళా మంత్రి స్పందన
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తుదిశ్వాస విడిచారన్న వార్తతో షాక్ కు గురయ్యారు జార్ఖండ్ మహిళా మంత్రి నీరా యాదవ్. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కలాం లేరన్న వార్తను నమ్మలేక పోతున్నానని చెప్పారు. ఈ నెల 22న హజారీబాగ్ స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో కలాం ఫొటోకు దండవేసి, నివాళి అర్పించారు నీరా యాదవ్. ఈ చర్యతో ఆమె తీవ్ర విమర్శలపాలయ్యారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ఏకి పారేశారు. విధి వైపరీత్యమో ఏమో కాని, వారం తిరక్కుండానే కలాం తుదిశ్వాస వదలడంతో ఆమెకు నోట మాట రాలేదు. తనకు కలాంపై అమితమైన గౌరవం ఉందని, తన చిత్తశుద్ధిని శంకించరాదని ఆమె వేడుకున్నారు.