: కలాంకు ప్రీతి పాత్రమైనవి ఇవే!


మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఇష్టమైన వ్యాపకం ఇంటి పరిసరాలను పచ్చదనంతో కళకళలాడేలా చేయడం. ఆయన విద్యార్థులకు బోధించే ప్రతి సందర్భంలోనూ పరిసరాలను పచ్చగా ఉండేలా చూసుకోవాలని సందేశమిచ్చేవారు. అలాగే ఆయన దక్షిణాది వంటకాలను అమితంగా ఇష్టపడేవారు. అందులోనూ గోంగూర, నెయ్యి అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. భారీ వంటకాలను ఆయన పెద్దగా ఇష్టపడేవారు కాదు. వెజిటేరియన్ భోజనాన్నే ఆయన ఎంచుకునే వారని, స్వల్పంగా భోజనం తీసుకునేవారని ఆయన సహచరులు తెలిపారు. నిత్యం వ్యాయామం, క్రమబద్ధమైన జీవన శైలిని ఆయన ఆచరించేవారని, వేకువనే లేచి దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News