: ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్న కలాం పార్థివ దేహం


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతిక కాయం కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని పాలం విమానాశ్రయం చేరుకుంది. నిన్న మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లోని ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తర్వాత ఆయనను నగరంలోని బెథాని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రిలో చేరిన గంటకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో దేశం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. నేటి ఉదయం గౌహతి నుంచి భారత వైమానికదళానికి చెందిన ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన పార్థివ దేహం కొద్దిసేపటి క్రితం పాలం విమానాశ్రయానికి చేరుకుంది.

  • Loading...

More Telugu News