: ఇండియన్ మిస్సైల్ మ్యాన్ కు శాల్యూట్!... కలాంకు ప్రైవేట్ పాఠశాలల నివాళి


భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ పాఠశాలలు ఘనంగా నివాళులర్పించాయి. కలాం మృతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా అన్ని ప్రైవేట్ పాఠశాలలు నేడు సెలవు దినంగా ప్రకటించాయి. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సందేశాలు పంపాయి. ఈ సందేశాల్లో కలాంను ఆయా పాఠశాలలు ‘ఇండియన్ మిస్సైల్ మ్యాన్’గా అభివర్ణించాయి. ‘‘వియ్ శాల్యూట్ టూ అవర్ ఇండియన్ మిస్సైల్ మ్యాన్’ అంటూ ఆయా ప్రైవేట్ పాఠశాలలు కలాంకు ఘనంగా నివాళి అర్పించాయి.

  • Loading...

More Telugu News