: టీవీ చానెళ్ల 'లైవ్ కవరేజీ'పై సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం


మీడియా తీరుతెన్నులపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015 కేబుల్ నెట్ వర్క్ నిబంధనల ప్రకారం... ఉగ్రవాద నిరోధానికి...తీవ్రవాదుల అంతానికి చేపట్టే ఆపరేషన్లను లైవ్ కవరేజీ చేయకూడదు. ఈ నిబంధనను టీవీ ఛానెళ్లు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. వార్తలు ప్రపంచానికి చేరవేసి రేటింగ్ పెంచుకోవాలనే తాపత్రాయంతో మీడియా ఛానెళ్లు లైవ్ కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని ఛానెళ్లు లైవ్ కవరేజీ ఇవ్వడం చూసిన సమాచార ప్రసార శాఖ తక్షణం లైవ్ కవరేజీ ఆపాలని ఆదేశించింది. ఇంకోసారి ఇలా చేయవద్దని హెచ్చరించింది. గతంలో ముంబయ్ పేలుళ్ల సమయంలో టీవీ చానెళ్ల లైవ్ కవరేజీ కారణంగా భద్రతా బలగాల వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ల ద్వారా టెర్రరిస్టులకు వారి నాయకులు తెలియజేసేవారు. దీంతో ప్రభుత్వం చట్టానికి సవరణ చేసి, అలాంటి సందర్భాల లైవ్ కవరేజీని నిషేధించింది.

  • Loading...

More Telugu News