: లోక్ సభ నుంచి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ఒకరోజు సస్పెన్షన్


కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరిని లోక్ సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేశారు. సభా సమావేశాల సమయంలో ప్లకార్డులు ప్రదర్శించి పోడియంలోకి దూసుకెళ్లడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని రెండు రోజులుగా అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు రాకుంటే ఇలాంటి చర్యలు తప్పవన్నారు. సభ్యులు సభా మర్యాదలు పాటించాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యుడు అధిర్ ప్రవర్తన సక్రమంగా లేదన్నారు. ఆయన హద్దులు మీరినందువల్లే ఒకరోజు సస్పెన్షన్ వేటు వేసినట్టు స్పీకర్ వివరించారు. దానిపై స్పందించిన అధిర్, సభాపతి స్థానం పట్ల తనకెలాంటి దురుద్దేశం లేదని చెప్పారు. సభన్నా, సభాపతి అన్నా తనకు ఎనలేని గౌరవం ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సభాపతి వైపు వేలెత్తి చూపడం సమంజసమా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News