: సికింద్రాబాద్ లో నడిరోడ్డుపై యువకుడి హత్య


సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర నడిరోడ్డుపై ఓ యువకుడిని కొందరు దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఆటోలో వచ్చిన దుండగులు యువకుడిపై కత్తులతో విరుచుకుపడ్డారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. తీవ్ర గాయాలపాలై అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News