: మంత్రికి ఉద్వాసన పలికిన జయలలిత


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బాలాజీ సెంథిల్ కు ఉద్వాసన పలికారు. ముఖ్యమంత్రి సూచన మేరకు తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆయనను తొలగించారు. ఈ మేరకు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరూర్ జిల్లా అన్నా డీఎంకే కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న సెంథిల్ ను పార్టీ పదవి నుంచి కూడా తొలగించారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగమణికి రవాణా శాఖ బాధ్యతలు అదనంగా అప్పగించారు. కాగా, సెంథిల్ బర్తరఫ్ కు గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News