: భూకంపాల జోన్-3లో అమరావతి


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి భూకంపాల జోన్-3లో ఉందని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 'ఎర్త్ క్వేక్ ఇంజినీరింగ్ రీసర్చ్ సెంటర్' అధిపతి ప్రదీప్ కుమార్ తెలిపారు. కృష్ణా నది తీరంలోని విజయవాడ తీరప్రాంతాలన్నీ జోన్-3 కిందకే వస్తాయని చెప్పారు. అయితే జోన్-4, జోన్-5, జోన్-6 భూకంపాలతో పోలిస్తే జోన్-3 తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపారు. నేపాల్ సరిహద్దు ప్రాంతాలు, కాశ్మీర్ జోన్-5లో ఉన్నాయని చెప్పారు. టోక్యో, కాలిఫోర్నియా లాంటి నగరాలు జోన్-5 కన్నా అత్యధిక తీవ్రత కలిగి ఉన్నాయని... అయితే, భూకంపాలను తట్టుకుని నిలబడే విధంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల, రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించి, భూకంప తీవ్రతను తట్టుకునే విధంగా కట్టడాలను తీర్చిదిద్దాలని సూచించారు.

  • Loading...

More Telugu News