: ఆర్థిక స్థితి బాగున్నప్పుడు బిల్లుల చెల్లింపులు ఎందుకు ఆపేశారు?: ఈటెలపై ఒంటేరు ఫైర్


తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పై టీటీడీపీ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతున్నారని... అలాంటప్పుడు బిల్లుల చెల్లింపులను ఎందుకు ఆపేశారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, కేసీఆర్ నిరంకుశ వైఖరి వల్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం తరుగు బడ్జెట్ రాష్ట్రంగా అవతరించిందని ఎద్దేవా చేశారు. ఇదేదో దొరల పాలన అన్నట్టుగా కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. రకరకాల స్కీములను ప్రకటిస్తూ, కేసీఆర్ కాలం గడిపేస్తున్నారని... గూట్లో రాయి తీయలేని వాడు, ఏట్లో రాయి తీస్తానన్నట్లుగా ఆయన పాలన కొనసాగుతోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల రాష్ట్రం పరువు పోయిందని, పెట్టుబడిదారులు కూడా రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News