: ముష్కరమూకలో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉంది!


పంజాబ్ లోని దీనానగర్ పోలీస్ స్టేషన్ పై జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు ఏడుగురు పోలీసులు, లాకప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సైన్యం, పంజాబ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది కూడా హతమైనట్టు సమాచారం. అయితే, బయటకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక అంశం విస్తుగొలుపుతోంది. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల బృందంలో ఒక మహిళా ఉగ్రవాది కూడా ఉందట. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ కానిస్టేబుల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటిదాకా భారత్ పై దాడికి యత్నించిన ఉగ్రవాదుల్లో మహిళల జాడ లేదు. ఈనాటి దాడిలో మహిళా ఉగ్రవాది ఉన్నట్టైతే, కచ్చితంగా ఇది సంచలన వార్తే. పాక్ భూభాగంపై పనిచేస్తున్న టెర్రరిస్టులు కూడా ఐఎస్ఐఎస్ మాదిరి మహిళలను కూడా తమతో చేర్చుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News