: ‘అమ్మ’కు మళ్లీ తలనొప్పి షురూ... కర్ణాటక పిటిషన్ పై జయలలితకు సుప్రీం నోటీసులు
తమిళ తంబీల ఆరాధ్య దైవం, పురచ్చితలైవి జయలలితకు మళ్లీ తలనొప్పి ప్రారంభమైనట్లే. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ఏకంగా తమిళనాడు సీఎం పీఠాన్నే కోల్పోయిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, కర్ణాటక హైకోర్టు తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అయితే కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, కొద్దిసేపటి క్రితం జయలలితకు నోటీసులు జారీ చేసింది.