: నిప్పుల గుండంపై నడుస్తూ పడిపోయిన భక్తులు... శ్రీకాళహస్తి ధర్మారాజు గుడిలో అపశ్రుతి
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వేడుకగా జరుగుతున్న ధర్మారాజు గుడి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిప్పుల గుండంపై భక్తులు నడవడం అక్కడ ఆనవాయతీగా వస్తోంది. అయితే నిన్న రాత్రి ఏర్పాటు చేసిన నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఓ పురుషుడితో పాటు మరో భక్తురాలు నిప్పులపై పడిపోయారు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరు భక్తులను అధికారులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.