: ఏకే ఖాన్ తండ్రి భౌతికకాయానికి కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) డైరక్టర్ జనరల్ ఏకే ఖాన్ తండ్రి అబ్దుల్ కరీం ఖాన్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కరీం ఖాన్ మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కె.చంద్రశేఖరరావు ఈ సాయంత్రం ఏకే ఖాన్ ను పరామర్శించారు. ఖాన్ తండ్రి కరీం ఖాన్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా కరీం ఖాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు.