: 'నీ తలపై ఆ టోపీ ఎందుకు?'... వరంగల్ ఎస్పీపై కవిత ఫైర్
తనను చూసేందుకు ఎగబడుతున్న ప్రజలను సరిగ్గా నియంత్రించలేకపోయిన వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝాపై నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. వరంగల్ జిల్లా మంగపేట పుష్కర ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. కవితకు రక్షణగా పోలీసులు రోప్ పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ, తన చుట్టూ ప్రజలు అధిక సంఖ్యలో చేరడంతో ఉక్కిరిబిక్కిరైన కవిత తన అసహనాన్ని ఎస్పీపై చూపారు. "నీ మాట ఇక్కడ ఎవరూ లెక్కచేయనప్పుడు నీకు ఆ టోపీ ఎందుకు?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ, పుష్కరాలు విజయవంతం అయ్యాయని అన్నారు. పుష్కరాల కోసం అధికారులు బాగా కృషి చేశారని వివరించారు.