: 'బైద్యనాథ్' ప్రొడక్టుల్లో హానికారక లోహాలు: అమెరికా


ఆయుర్వేద ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తున్న ప్రముఖ భారత సంస్థ బైద్యనాథ్ ప్రొడక్టుల్లో హానికారక లోహాలున్నాయని అమెరికా తేల్చింది. ఈ మేరకు న్యూయార్క్ సిటీ ఆరోగ్య విభాగం ఒక ప్రకటన వెలువరుస్తూ, అమెరికన్ పౌరులు బైద్యనాథ్ ఔషధాలను వాడరాదని సూచించింది. సంస్థ మార్కెటింగ్ చేస్తున్న కొన్ని ఉత్పత్తుల్లో లెడ్ (సీసం) పరిమితికి మించి ఉందని, మానవుల ఆరోగ్యానికి ఇది సురక్షితం కాదని తెలిపింది. తక్షణం ఈ ఔషధాలను వాడటం నిలిపివేయాలని న్యూయార్క్ వాసులకు సిఫార్సు చేసింది. ఈ ఉత్పత్తులను ఏ స్టోర్ లో అయినా విక్రయిస్తుంటే, అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరింది. లెడ్ తో పాటు మెర్క్యురీ సైతం పరిమితులకు మించి బైద్యనాథ్ ఉత్పత్తుల్లో కనిపించిందని న్యూయార్క్ ఆరోగ్య విభాగం తెలిపింది. అయితే, అన్ని ఆయుర్వేద ఉత్పత్తుల్లో హానికారకాలు వెలుగుచూడలేదని, కొన్ని ఉత్పత్తుల్లోనే హానికారక లోహాలు ఉన్నాయని బ్యూరో ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ డిసీజ్ అసిస్టెంట్ కమిషనర్ నాన్సీ క్లార్క్ తెలిపారు. వీటిని ఎవరూ అమ్మరాదని, కొనరాదని ఆదేశించారు.

  • Loading...

More Telugu News