: మిస్ నెల్లూరుగా ఎంపికైన సుమయ


మిస్ నెల్లూరు-2015 విజేతగా సుమయ ఎంపికైంది. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో జడ్జీలుగా సినీ దర్శకుడు వి.సముద్ర, 'మిస్ ఏపీ' సిమ్రాన్, అవనీంద్ర కుమార్ లు వ్యవహరించారు. ఫస్ట్ రన్నరప్ గా తనూర్య, సెకండ్ రన్నరప్ గా శ్రావణిలు ఎంపికకాగా, మిస్ బ్యూటిఫుల్ ఐస్ గా లిఖితప్రియ, ఫొటోజెనిక్ ఫేస్ గా ఐశ్వర్య, బ్యూటిఫుల్ స్మైల్ గా సుప్రియ, బ్యూటీ బాడీగా శరణ్య, బ్యూటిఫుల్ హెయిర్ గా వంశీప్రియ నిలిచారు. నగరానికి చెందిన మొత్తం 150 మంది పోటీపడగా, ఫైనల్స్ కు 12 మందిని ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News