: కోయంబత్తూరు విమానాశ్రయంలో కలకలం రేపిన స్కూల్ బ్యాగ్
తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయంలో ఓ స్కూలు బ్యాగు కలకలం రేపింది. ఈ రోజు ఉదయం 7.30 నిమిషాలకు చెన్నై నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో స్కూలు బ్యాగు పడి ఉండడాన్ని గమనించాడు. అందులో పేలుడు పదార్థం ఉందేమోనని అనుమానించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బ్యాగులో ఉన్నది స్కూలు పుస్తకాలని తేలింది. ఆ పుస్తకాలు అంతకు ముందు వచ్చిన విమానంలో ప్రయాణించిన బాలికవని, పొరపాటున బ్యాగ్ మర్చిపోయిందని తెలిసింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.