: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త


తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. సుదీర్ఘ కాలంగా ఊరిస్తున్న సమయం వచ్చింది. టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తరువాత తొలి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. 15 శాఖల్లో 15 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. అలాగే వయో పరిమితిని పదేళ్లు పెంచినట్టు ఆయన తెలిపారు. దీంతో 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు వయోపరిమితి పెరగనుంది. పోలీసు శాఖలో 8,000, విద్యుత్ శాఖలో 2,681, మిగతా శాఖల్లో 4,300 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఉద్యోగాలన్నీ టీపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నియమ నిబంధనలు త్వరలోనే ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ తెలియజేశారు.

  • Loading...

More Telugu News