: జైట్లీజీ!... కార్గిల్ దివస్ నేడు కాదు, రేపు: నెటిజన్లు
1999లో పాకిస్థాన్ పన్నిన కుట్రకు 490 మంది దేశ వీరులు బలైపోయిన ఘటనను గుర్తు చేసుకుంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్లో నివాళి అర్పించారు. 'కార్గిల్ యుద్ధం ముగిసి 16 ఏళ్లు పూర్తైన నేటి 'విజయ దివస్' సందర్భంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుందాం' అంటూ అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. దీంతో అరుణ్ జైట్లీ ట్వీట్ పై పెద్దఎత్తున నెటిజన్లు స్పందించారు. 'జైట్లీజీ...విజయ్ దివస్ నేడు కాదు రేపు' అంటూ సరిచేశారు. కాగా, కార్గిల్ ప్రాంతంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ పర్యటించి, విజయ్ దివస్ పేరిట ప్రారంభమైన ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీంతో చాలా మంది నేడే 'విజయ దివస్' అని పొరపాటు పడ్డారు. దీంతో సోషల్ మీడియాలో సైన్యం సేవలను కొనియాడుతూ పలువురు పోస్టులు పెట్టారు.