: రాజమండ్రిలో ప్రారంభమైన బాలమురళీకృష్ణ గానకచేరి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానకచేరి ప్రారంభమైంది. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి, సీఎం చంద్రబాబు, సతీమణి భువనేశ్వరి, ఏపీ మంత్రులు, తదితరులు హాజరయ్యారు. గోదావరి మహాపుష్కరాల ముగింపు వేడుకల్లో భాగంగా ఆయనతో ప్రత్యేకంగా ఈ గానకచేరిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు కాసేపట్లో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో గోదావరి అఖండ హారతి నిర్వహించనున్నారు.