: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిందితులకు ఊరట
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు ఊరట కల్గించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు నిందితులుగా నిలబెట్టిన 16 మంది క్రికెటర్లను నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరించింది. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని కేసు నమోదు చేసిన పోలీసులు, ఆరోపణలను రుజువు చేయలేకపోయారని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడ్డప్పటి నుంచి నిషేధం వేటు ఎదుర్కొంటున్న 16 మంది క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 16 మంది క్రికెటర్ల కెరీర్ ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఢిల్లీ కోర్టు తీర్పుతో వారంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.