: డబుల్ సెంచరీ 'డబుల్ ధమాకా' ఆనందంలో సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డబుల్ సెంచరీ ఆనందంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమా వార్షికోత్సవం రోజునే తాజాగా విడుదలైన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో రెండు డబుల్ సెంచరీల ధమాకాతో సల్మాన్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు. సాజిద్ నడియావాలా దర్శకత్వంలో రూపొందిన 'కిక్' (తెలుగు 'కిక్'కి రీమేక్) సినిమా గతేడాది ఈద్ కానుకగా జూలై 25న రిలీజైంది. ఆ సినిమా 233 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. కాగా ఈ ఏడాది ఈద్ కానుకగా 'భజరంగీ భాయ్ జాన్' సినిమా రిలీజై రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. కిక్ వసూళ్లను 'భజరంగీ' సినిమా సులువుగా దాటేస్తుందని సినీ రంగ ప్రముఖులు పేర్కొంటున్నారు.