: రాహుల్ పై ఎంపీ కవిత వ్యాఖ్యలను ఖండించిన టి.కాంగ్రెస్


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఖండించారు. ఎన్డీఏకు చేరువకావాలన్న ఆలోచనతోనే ఆమె రాహుల్ ను విమర్శిస్తున్నారన్నారు. చేసిన పాపాలు పోవాలంటే రాహుల్ పుష్కర స్నానాలు చేయాలని కవిత అనడం ఆమె అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు ఢిల్లీలో సోనియా నివాసానికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పినప్పుడు పాపాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. అంటే తెలంగాణ ఇవ్వడం రాహుల్ చేసిన పాపమా? అని గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి సూటిగా అడిగారు. తెలంగాణలో వెయ్యి మంది రైతుల ఆత్మహత్యల పాపం అధికార టీఆర్ఎస్ దేనని, వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News