: రాజరాజ నరేంద్రుడికి చంద్రబాబు నివాళి
రాజమండ్రి నగర నిర్మాత, చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడి విగ్రహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని రాజమండ్రిలోనే ఉంటున్న చంద్రబాబు, పుష్కరాల ముగింపు సందర్భంగా నగరంలోని రాజరాజ నరేంద్రుడి విగ్రహానికి నివాళి అర్పించారు. రాజమండ్రిలో ఈ దఫా నిర్వహించిన పుష్కరాలు చరిత్రలో నిలిచిపోతాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.