: డబ్బు, ఖ్యాతి కన్నా ప్రేమానురాగాలే అమూల్యం: రావూరి భరద్వాజ
మనిషి జీవితంలో డబ్బు, ఖ్యాతి కన్నా.. ప్రేమానురాగాలు వెలకట్టలేనివని సుప్రసిద్ద రచయిత, 'జ్ఞాన్ పీఠ్' పురస్కార విజేత రావూరి భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఆయనను నేడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సముచిత రీతిలో సన్మానించింది. ఈ సందర్భంగా భరద్వాజ మాట్లాడుతూ, తన అర్థాంగి కాంతమ్మ తన సాహితీ సృజనకు ఎనలేని ప్రోత్సాహం అందించిందని, కష్టనష్టాల్లో సైతం తోడునీడగా నిలిచి ప్రేమను పంచిందని గుర్తు చేసుకున్నారు. ఇక యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డా.ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ, ప్రతిభావంతులను పురస్కారాలే వెతుక్కుంటూ వస్తాయని పేర్కొన్నారు. అందుకు రావూరి భరద్వాజే నిదర్శనమని చెప్పారు. తెలుగు సాహిత్యంలో ఓ నవలకు 'జ్ఞాన్ పీఠ్' దక్కడం ఇదే మొదటిసారి అని శివారెడ్డి వెల్లడించారు.