: మూడేళ్లు పూర్తిచేసుకున్న రాష్ట్రపతి... శుభాకాంక్షలు తెలిపిన మోదీ
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి ప్రణబ్ ముఖర్జీ నేటితో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రణబ్ అపార అనుభవం, విజ్ఞానం దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని ట్వీట్ చేశారు. కాగా ఈ మూడేళ్లలో ప్రణబ్ 105 దేశాలను సందర్శించారు.