: విడిపోయిన టెన్నిస్ ప్రేమజంట!
టెన్నిస్ ప్రేమజంట మరియా షరపోవా, గ్రిగర్ దిమిత్రోవ్ లు విడిపోయారు. తమ రెండేళ్ల ప్రేమాయణానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని స్వయంగా దిమిత్రోవ్ వెల్లడించాడు. తమ ఇద్దరి దారులు వేరయ్యాయని తెలిపాడు. వ్యక్తిగత జీవితంతో పాటు ఆటలోనూ షరపోవా విజయాలు సాధించాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. తమ మధ్య ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయన్నాడు. ఇక నుంచి తామిద్దరం ఆటపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్టు వివరించాడు. టెన్నిస్ లో అత్యంత ఆకర్షణీయ ప్రేమజంటగా గుర్తింపున్న వారిద్దరి ప్రేమాయణం 2013లో ఆరంభమైంది. అప్పుడే మీడయా కంట్లో పడిన ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. గతంలో సెరెనా విలియమ్స్ తోనూ ఈ బల్గేరియా యువఆటగాడు ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.