: పుష్కర స్నానమాచరించిన బాలకృష్ణ... పితృదేవతలకు పిండప్రదానం
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పవిత్ర గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు. పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఆయన గోదావరిలో మూడు మునకలు వేశారు. అనంతరం పితృదేవతలకు పిండప్రదానం చేశారు. ఈ సందర్భంగా, బాలయ్య వెంట పలువురు నేతలు, ప్రముఖులు తరలి వచ్చారు. బాలయ్యను చూసేందుకు ప్రజలు అమితాసక్తిని చూపించారు. పుష్కరాలు ఆరంభం అయినప్పటినుంచి బాలయ్య ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈరోజున 'ఆది పుష్కరాలు' ముగియనున్న తరుణంలో, ఆయన రాజమండ్రికి వచ్చి సందడి చేశారు.