: వస్త్ర వ్యాపారుల ముసుగులో సిమీ టెర్రరిస్టులు... పట్టిస్తే రూ.40 లక్షలిస్తామంటున్న ఎన్ఐఏ


తెలుగు రాష్ట్రాల పరిధిలో నలుగురు సిమీ ఉగ్రవాదులు మాటు వేశారట. ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు వారికోసం వేట మొదలెట్టారు. వస్త్ర వ్యాపారుల అవతారమెత్తిన ఆ నలుగురు ఉగ్రవాదులు భారీ విధ్వంసానికే ప్లాన్ చేశారని కూడా ఎన్ఐఏ చెబుతోంది. నలుగురు ఉగ్రవాదుల ఫొటోలను మీడియాకు విడుదల చేసిన ఎన్ఐఏ అధికారులు, ఉగ్రవాదుల సమాచారమిస్తే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేకాక ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.40 లక్షల రివార్డు కూడా అందజేస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.

  • Loading...

More Telugu News