: హైదరాబాదు శివారులో ‘మోస్ట్ వాంటెడ్’ నయీం... ప్రైవేట్ సైన్యంతో హల్ చల్!
మాజీ నక్సలైట్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం నిన్న రాత్రి హైదరాబాదు నగర శివారులో హల్ చల్ చేశాడట. ప్రైవేట్ సైన్యంతో వచ్చిన అతడు, నిర్భయంగా తన సోదరి కూతురు వివాహానికి హాజరైనట్టు సమాచారం. నగర శివారు ప్రాంతం తుక్కుగూడలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిన్న రాత్రి నయీం సోదరి కూతురు వివాహం జరిగింది. ఈ వివాహానికి ప్రైవేట్ సైన్యాన్ని వెంటేసుకుని నయీం వచ్చాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. నయీం ఫంక్షన్ హాల్లోకి వెళ్లగా, అతడి ప్రైవేట్ సైన్యం మాత్రం ప్రవేశ ద్వారం వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు చేశారట. వివాహ వేడుకకు వచ్చిన వారిని పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. దీనిపై పోలీసులు మాత్రం నోరు మెదపట్లేదు.