: తెలంగాణ రైతులకు రూ.2 లక్షలు... ఏపీలో రూ.50 వేలే! సాయంలో రాహుల్ భిన్న వైఖరి
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయమందించడంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భిన్న వైఖరి అవలంబించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా యాత్రల పేరిట రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మే నెలలో తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో రాహుల్ పాదయాత్ర సాగింది. ఆ సందర్భంగా ఆయన ఆత్మహత్య చేసుకున్న 9 మంది రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఇక నిన్న ఏపీలోని అనంతపురం జిల్లాలోనూ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న 49 మంది రైతులకు చెందిన కుటుంబాలకు ఆయన రూ.50 వేలు చొప్పున అందజేయడం గమనార్హం.