: నా పెళ్లికీ, దేశ సమస్యలకు సంబంధం లేదు: 'అనంత' పర్యటనలో రాహుల్ వ్యాఖ్య!
అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించిన సందర్భంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్ర ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు స్పందించిన ఆయన కొన్ని విషయాలపై నర్మగర్భ వ్యాఖ్యలూ చేశారు. కొన్నింటికి సరదా సమాధానాలు ఇచ్చారు. తన పెళ్లిపై మీడియా సంధించిన ప్రశ్నలకూ రాహుల్ స్పందించారు. ‘‘నేను పార్టీకి ఫుల్ టైమ్ పనిచేస్తున్నానా? పార్ట్ టైం పనిచేస్తున్నానా? అనేది అప్రస్తుతం. ప్రజల కోసం పనిచేస్తున్నానా? లేదా? అనేదే ముఖ్యం. నేను సీరియస్ అంశాలపై చర్చిస్తున్నాను. ఇలాంటి సమయంలో నా పెళ్లి గొడవ అక్కర్లేదు. నా పెళ్లికీ, దేశ సమస్యలకూ సంబంధం లేదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.