: గెలుపు ఓటములపై ఫిట్ నెస్ తీవ్ర ప్రభావం చూపుతుంది: సైనా నెహ్వాల్
గెలుపు, ఓటములపై ఫిట్ నెస్ తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పేర్కొంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ సహా ఇతర టోర్నీలకు సన్నద్ధమవుతున్న సందర్భంగా సైనా మాట్లాడుతూ, శారీరక దృఢత్వంపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయని చెప్పింది. త్వరలో జరగనున్న టోర్నీల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించానని, విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని సైనా తెలిపింది. ఆటలో ఫిట్ నెస్ చాలా ముఖ్యమైనదని, ఫిట్ గా లేకుంటే విజయాలు సాధ్యం కావని ఆమె పేర్కొంది. కాగా, సైనా వరల్డ్ నెంబర్ టూ ర్యాంక్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.