: బ్యూటీ పార్లర్లు మూసివేయాలంటూ కాశ్మీర్లో ఉగ్ర సంస్థ హెచ్చరికలు!


జమ్మూకాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాద సంస్థ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది! ఈ క్రమంలో, పుల్వామా జిల్లాలో హిజ్బుల్ పేరిట వెలిసిన కొన్ని పోస్టర్లు కలకలం రేపాయి. బ్యూటీ పార్లర్లు మూసివేయాలని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆ పోస్టర్లలో హెచ్చరించారు. 'కరీమాబాద్, నెవా, జదూరా, వాహిబుగ్, కలాన్ ప్రాంత ప్రజలు మద్యానికి, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, అనవసరమైన కార్యకలాపాలకు పాల్పడరాదని హెచ్చరిస్తున్నాం" అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆ పోస్టర్లపై హిజ్బుల్ లోగో కూడా ఉంది. బ్యూటీ పార్లర్ల వ్యాపారం నిలిపివేయాలని కూడా స్పష్టం చేశారు. పోస్టర్ల విషయాన్ని నిర్ధారించిన పోలీసులు అదెవరి పనో తేల్చేందుకు ముందుకు కదిలారు. ఈ పోస్టర్ల వెనుక హిజ్బుల్ హస్తం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని, కానీ, ఇది ఎవరో వేరే వ్యక్తుల పనిలా కనిపిస్తోందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News