: రాజమౌళిపై రాజమండ్రి సభలో చంద్రబాబు ప్రశంసలు
సీఎం చంద్రబాబు దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో సీఎం మాట్లాడుతూ, 'బాహుబలి' చిత్రాన్ని తాను చూశానని, చాలా బాగా తెరకెక్కించారని అన్నారు. ఉత్తమ క్రియేటర్లలో రాజమౌళి ఒకరని పొగిడారు. ఆయన ఏ సినిమా తీసినా బెస్ట్ గా ఉండేలానే తీస్తారన్నారు. అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టమన్నారు. ఇలాంటి సినిమాలను చూసినప్పుడు... మంచి దర్శకులున్నారని, ఎంటర్ ప్రెన్యూర్స్ ఉన్నారని అందరికీ తెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే సినిమా వాళ్లు కొంత సమయాన్ని సినిమాలకు, సొంతానికి ఉపయోగించుకుని, మరికొంత సమయాన్ని సమాజం కోసం కూడా ఉపయోగించాలని సీఎం కోరారు. సమాజంలో మార్పు తీసుకురావడం వల్ల అందరికీ ఆనందంగా ఉంటుందని చెప్పారు.