: బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది: ఆర్.కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య బీసీల కోసం ఓ రాజకీయ పార్టీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీసీలకు చెందిన కులాలను రాజకీయ పార్టీలన్నీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. అవసరాలు తీరాక మొండి చేయి చూపిస్తున్నాయన్నారు.