: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వీళ్లకు తెలుసు


విడుదలైన అన్ని చోట్లా నీరాజనాలు అందుకుంటున్న 'బాహుబలి' గురించిన చర్చతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. 'బాహుబలి' సినిమా ముగింపు సందర్భంగా ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుంటూ 'బాహుబలి'ని తానే చంపానని కట్టప్ప శివుడికి చెబుతాడు. దీంతో 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపాడు? అంటూ సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. దీనిపై నెటిజన్లు జోక్ లు, వ్యంగ్యాలు, కామెంట్లతో సందడి చేస్తున్నారు. వాటిల్లో జోరుగా ప్రచారమవుతున్న రెండు కామెంట్లు ఏంటంటే... 'బాహుబలి' ద బిగినింగ్ లో కట్టప్ప ప్లేటులో భోజనం చేసిన బాహుబలి మామా అని సంభోదించి అభిమాన పాత్రుడవుతాడు. అది అలవాటుగా మారిన బాహుబలి ఓసారి ఆకలిగా తింటున్న కట్టప్ప ప్లేటు లాగేసుకుంటాడు. దీంతో కోపమొచ్చిన కట్టప్ప 'బాహుబలి'ని చంపేశాడని కొందరు అంటుండగా, మరి కొందరు 'మిర్చి'సినిమాలో ప్రభాస్ తన భార్యను బలిగొన్నాడన్న కసితో కట్టప్ప 'బాహుబలి'ని అంతమొందించి ప్రతీకారం తీర్చుకున్నాడంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా, సోషల్ మీడియాలో 'క్వచ్ఛన్ ఆఫ్ ద ఇయర్' గా కట్టప్ప 'బాహుబలి'ని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ప్రాచుర్యం పొందింది.

  • Loading...

More Telugu News