: సైబరాబాద్ కు గుర్తింపును టీడీపీయే తీసుకొచ్చింది: చంద్రబాబు


రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో ఈ రోజు జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'తెలుగువారి చరిత్ర-సంస్కృతి' అనే అంశంపై సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంపై స్పందించారు. సాధారణ నగరంగా ఉండే హైదరాబాద్ ను నాలెడ్జ్ సిటీగా తయారుచేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రపంచదేశాల్లో సైబరాబాద్ కు గుర్తింపును తామే తీసుకొచ్చామని పేర్కొన్నారు. విభజనతో ఏపీ కష్టాల్లో పడిందని, అయినా అధైర్యపడకుండా మనం ముందుకు వెళదామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువాడు కనిపిస్తే తెలుగులోనే మాట్లాడాలన్నారు. అప్పుడే తెలుగుభాషకు గౌరవం ఇచ్చిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుటుంబవ్యవస్థ భారతదేశంలో మాత్రమే ఉందన్నారు.

  • Loading...

More Telugu News