: ఐఎస్ఐఎస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసిన టర్కీ
సిరియాలోని ఐఎస్ఐఎస్ మిలిటెంట్ల స్థావరాలపై టర్కీ వైమానిక దాడులు చేసింది. మూడు స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో ఈ దాడులకు పాల్పడింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై వైమానిక దాడులకు టర్కీ పాల్పడటం ఇదే తొలిసారి. దీంతో పాటు, సరిహద్దు పొడవునా పలునగరాల్లో ఐఎస్, కుర్దిష్ మిలిటెంట్లపై పోలీసులు దాడులు నిర్వహించారని, 251 మందిని అరెస్ట్ చేశారని టర్కీ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.