: ప్రధాని సభకు ఉగ్ర ముప్పు... మహిళా బాంబర్లు దాడి చేయవచ్చన్న ఐబీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బీహార్ లోని ముజఫర్ పూర్ లో భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. అయితే, ఈ సభపై ఉగ్రవాదులు కన్నేశారని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది. ఉగ్రవాదులు మహిళా బాంబర్లతో మోదీ సభపై దాడికి దిగే అవకాశం ఉందని అనుమానిస్తున్న ఐబీ వర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. అటు, బీహార్ సర్కారుకు కూడా సమాచారం అందించాయి. ఐబీ సమాచారం నేపథ్యంలో, కీలక ప్రాంతాల్లో భద్రత పెంచారు. సభ వేదిక వద్దకు అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించారు. అటు, మోదీ సభ నేపథ్యంలో నక్సల్స్ బంద్ కు పిలుపునిచ్చారు. దాంతో, సీఐడీ విభాగం అప్రమత్తమైంది.