: పరిటాల సునీతకు తప్పిన ప్రమాదం... కాన్వాయ్ ను ఢీకొన్న కారు


ఏపీ మంత్రి పరిటాల సునీతకు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్ ను ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, మంత్రికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News