: రాహుల్ పర్యటనకు దూరంగా శైలజానాథ్... కొత్త అనుమానాలకు బీజం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాకే చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ హాజరుకాలేదు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశం అయింది. రాజమండ్రి పుష్కరఘాట్ లో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా రఘువీరా, చిరంజీవిలతో కలసి శైలజానాథ్ రాజమండ్రికి వెళ్లారు. కానీ, సాక్షాత్తు రాహుల్ గాంధీ చేపట్టిన పర్యటనకు మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, శైలజానాథ్ కూడా పార్టీ మారనున్నారా? అనే అనుమానం కలుగుతోందనే వార్తలకు రెక్కలు వచ్చాయి.