: లోక్ సభకు త్వరలోనే ఎన్నికలు: వెంకయ్య
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగానే దేశాభివృద్ధి తగ్గి, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. త్వరలోనే లోక్ సభకు ఎన్నికలు వస్తాయని అభిప్రాయడ్డారు. వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలతో బీజేపీ ముందుకు వస్తుందని చెప్పారు. ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి తీయడంపై గగ్గోలు పెడుతున్న ప్రజాసంఘాలు, అతడు పార్లమెంట్ పై దాడి చేసినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు.