: కేసీఆర్ కు తన కూతురొక్కరే బాగుంటే సరిపోతుందా? ఇతర మహిళలు పట్టరా?: టి.మహిళా కాంగ్రెస్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదని టి.మహిళా కాంగ్రెస్ చీఫ్ నేరెళ్ల శారద విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా కీర్తించిన కేసీఆర్... తన కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటు ఇవ్వకపోవడం సిగ్గు చేటని అన్నారు. తన కూతురు కవిత ఒక్కరే బాగుంటే చాలని కేసీఆర్ అనుకుంటున్నారని మండిపడ్డారు. ఇంతవరకు తెలంగాణలో మహిళా కమిషన్ ను కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల్లో కూడా మహిళలకు కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News