: మామ, అల్లుడు నన్ను విమర్శించడం మానుకోవాలి: డీకే అరుణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ మరోసారి మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె మండిపడ్డారు. ఎత్తిపోతల పనులకు శంకుస్థాపన చేసి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 7 వేల కోట్లు మంజూరు చేశామని, మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆమె చెప్పారు. అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ పని చేయకుండా తమపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామ, అల్లుడు తనను విమర్శించడం మానుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News